ద్రాక్ష రసగుల్లా

- May 18, 2016 , by Maagulf
ద్రాక్ష రసగుల్లా

 కావలసిన పదార్థాలు: సన్నటి ముక్కలుగా కోసుకున్న ఆకుపచ్చ ద్రాక్షలు - ఒక కప్పు, యాపిల్‌ ముక్కలు - కొన్ని, అరటిపండు ముక్కలు - కొన్ని, వెనిల్లా ఎసెన్స్‌ - అర టీస్పూన్‌, మిల్క్‌మెయిడ్‌ - నాలుగు టేబుల్‌ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము - ఒక కప, మిల్క్‌బ్రెడ్‌ - ఆరు ముక్కలు, పంచదార పొడి - ఒక టేబుల్‌ స్పూన్‌, టూటిఫ్రూటి, జీడిపప - తగినన్ని. 

తయారీ విధానం: బ్రెడ్‌ ముక్కల అంచులు కట్‌ చేసి తీసేయాలి. తరువాత ఒక గిన్నెలో ఆకుపచ్చ ద్రాక్షలు, యాపిల్‌, అరటిపండ్ల ముక్కలు, టూటిఫ్రూటీ, జీడిపప, వెనిల్లా ఎసెన్స్‌, పంచదార పొడి వేసి కలపాలి. రెండు స్పూన్ల ఈ మిశ్రమాన్ని తీసుకుని ఒక బ్రెడ్‌ ముక్కపైన పెట్టి ఉండలా చుట్టాలి. ఈ ఉండల్ని మొదట మిల్క్‌మెయిడ్‌లో తరువాత కొబ్బరి పొడిలో దొర్లించాలి. అంతే ద్రాక్ష రసగుల్లా సిద్ధం. ఈ రసగుల్లాల పైన ఒక గ్రేప్‌ పెట్టి అలంకరించండి. చూస్తుంటేనే తినేయబుద్ధి అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com