ఇస్రో సంచలనం.. జాబిల్లి పై ఉన్న మూలకాలను గుర్తించిన ప్రజ్ఞాన్ రోవర్

- August 30, 2023 , by Maagulf
ఇస్రో సంచలనం.. జాబిల్లి పై ఉన్న మూలకాలను గుర్తించిన ప్రజ్ఞాన్ రోవర్

బెంగుళూరు: చంద్రుడి దక్షిణ ధ్రువంపై ప్రజ్ఞాన్ రోవర్ పలు మూలకాల మిశ్రమాలను గుర్తించింది. మూలకాలను పరిశోధించేందుకు ప్రజ్ఞాన్ రోవర్‌లో లేజర్-ఇండ్యుసెడ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ (LIBS) పరికరాన్ని అమర్చిన విషయం తెలిసిందే.

ఎల్ఐబీఎస్ పేలోడ్ ను బెంగళూరులోని ఇస్రో ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ లో అభివృద్ధి చేశారు. దక్షిణ ధ్రువంపై ఎల్ఐబీఎస్ మొట్టమొదటి శాస్త్రీయ పరిశోధన చేసిందని ఇస్రో ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణ ధ్రువానికి సమీపంలో సల్ఫర్ ఉన్నట్లు తేల్చిందని ఇస్రో పేర్కొంది. ఎల్ఐబీఎస్ శాస్త్రీయ సాంకేతికత ఆధారంగా మూలకాలను విశ్లేషిస్తుందని ఇస్రో తెలిపింది.

ప్రాథమిక విశ్లేషణ చేసి పలు అంశాలను నిర్థారించామని పేర్కొంది. దాని ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో అల్యూమినియం (Al), సల్ఫర్ (S), కాల్షియం (Ca), ఐరన్ (Fe), క్రోమియం (Cr), టైటానియం (Ti) ఉన్నట్లు తేల్చామని చెప్పింది. అలాగే, మరికొన్ని గణాంకాల ద్వారా మాంగనీస్ (Mn), సిలికాన్ (Si), ఆక్సిజన్ (O) ఉనికి ఉన్నట్లు గుర్తించామని ఇస్రో పేర్కొంది. ప్రస్తుతం హైడ్రోజన్ ఉనికి గురించి పరిశోధన జరుగుతోందని చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com