చిరు ధాన్యాలు (మిల్లెట్స్) అధికంగా తింటున్నారా.?

- August 29, 2023 , by Maagulf
చిరు ధాన్యాలు (మిల్లెట్స్) అధికంగా తింటున్నారా.?

ఒకప్పుడు చిరు ధాన్యాలు ఆహారంలో భాగంగా వుండేవి. కానీ, మారిన నాగరిక పరిస్థితుల నేపథ్యంలో అంతా పాలిష్డ్ ఫుడ్‌కి అలవాటైపోయారు. అలా చిరు ధాన్యాలను పక్కన పెట్టేశారు.

అయితే, మళ్లీ ఇప్పుడు ఆహారంపై పెరిగిన అవగాహన, శ్రధ్ద.. ఆరోగ్యంపై ఫోకస్ అన్నీ వెరసి, వాళ్లు తింటున్నారట.. వీళ్లు తింటున్నారట.. అంటూ చిరు ధాన్యాల వైపు మళ్లీ దృష్టి మళ్లిస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే అరకొర అవగాహనతో చిరు ధాన్యాలను తింటూ అనవరసరమైన అనారోగ్యాలు కోరి తెచ్చుకుంటున్నారు.

అవిసెలు, రాగులు, సజ్జలు, పొద్దు తిరుగుడు గింజలు, నువ్వులు.. ఇలా అనేక రకాల చిరు ధాన్యాలు (మిల్లెట్స్) వాడకం బాగా పెరిగింది.

అయితే, వీటిలో కొన్ని రకాలను అతిగా తింటే అనారోగ్యం బారిన పడడం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అవిసెలు.. వీటిని సమపాళ్లలో తింటే మంచిదే. హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడంలో అవిసెలు చాలా ఉపకరిస్తాయ్. అలాగే అధిక కొవ్వును కరిగించడంలోనూ ఇవి తోడ్పడతాయ్.

కానీ, ఎక్కువ డోస్‌లో తింటే మాత్రం రక్తపోటు, గుండె నొప్పి తదితర పెను ప్రమాధాలకు కారణమవుతున్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది.

అలాగే పొద్దుతిరుగుడు గింజలు కూడా. వీటిలో అధిక శాతం ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు వుంటాయ్. ఇవి సరిపడినంత డోస్‌లో మాత్రమే శరీరానికి అందాలి. కాదని డోస్ ఎక్కువయితే, జీర్ణక్రియ మెటబాలిజంను దెబ్బ తీస్తాయ్. తక్షణ శక్తినందించి, కాల్షియం పాళ్లు పెంచే నువ్వులు కూడా మితంగానే తీసుకోవాలని సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com