తుఫాన్ హెచ్చరిక..!! అప్రమత్తం..!!
- May 18, 2016
మరో రెండు గంటల్లో రోనో తుఫాన్ గా మారనున్న వాయుగండం. మచిలీపట్నంకు 170కి.మీ దూరంలో కేంద్రీకృతం. బుధవారం రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా లో ఈదురు గాలుల భీభత్సం, భారీ వర్షం. మచిలీపట్నంలో 15 సెం.మీ పైగా వర్షపాతం నమోదు. మంగినపూడి బీచ్ వద్ద ఎగసి పడుతున్న అలలు. రాత్రి నుంచి విద్యుత్ కు అంతరాయం. ఇబ్బంది పడుతున్న ప్రజలు. బందరు నియోజకవర్గంలోని కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన విపత్తుల రక్షణ బృందాలు. మరో 48 గంటల్లో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది . తీరం దాటే సమయంలో గంటకు90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలిలు వీస్తాయని వాథావరణశఖ హెచ్చరిక జారీ చేసింది . తుఫాన్ కు ముందే భీభత్సమైన గాలులు వీస్తుండటంతో భయోంధనళ లో మచిలీపట్టణం వాసులు. నిన్నటి నుండి కరెంటు లేకపోవడంతో ఇన్వెర్టర్ లు చార్జింగ్ అయిపోయింది. మొబైల్ ఫోన్లలలో చార్జింగ్ లేకపోవడంతో తమ తమ వారితో కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి. సామాజిక మీడియా ద్వారా తుపాను పరిస్థితిని కొంత మేర సమాచారం తెల్సుకొంటున్నారు. మచిలీపట్నంకు చెందిన " బందరు బంధువులు " 13 వేల మంది సభ్యులు ఉన్న పేస్ బుక్ గ్రూప్ తుపాను సమాచారం అందరకి తెలియచేస్తున్నారు వర్షం,గాలి ఉధృతి పెరిగింది. కారు మబ్బులు తో పగలే చీకట్లు కమ్ముకున్నాయి. మరి ఈ తుపాను పయనం ఎటో..ఎలాంటి భీభత్సం సృష్టిస్తుందో ?? మే-19 వాతావరణం చూస్తుంటే 1977 నవంబర్ 19 వ తేదీ భయం ప్రజలను వెంటాడుతుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







