జూన్ 15 నుంచి మిడ్ డే డ్రేక్
- May 19, 2016
జూన్ 15 నుంచి మిడ్ డే బ్రేక్ తప్పనిసరి చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3 గంటల వరకు మూడు నెలలపాటు ఈ మిడ్ డే బ్రేక్ ఉంటుంది. నిబంధనల్ని ఉల్లంఘించే సంస్థలు 5,000 దిర్హామ్‌లు ఒక్కో వర్కర్‌కీ జరీమానా చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా ఈ జరిమానా 50,000 దిర్హాహ్‌లు. కంపెనీని డీగ్రేడ్ చేయడం, తాత్కాలికంగా ఆపరేషన్స్ నిలిపివేయడం వంటి కఠిన చర్యలూ తీసుకోబడ్తాయి కంపెనీలపైన. వేసవి కాలం ఎండ తీవ్రత కారణంగా మినిస్ట్రీ గత 11 ఏళ్ళుగా ఈ మిడ్ డే బ్రేక్ నిర్ణయాన్ని అమలు చేస్తోంది. ఇది 12వ సంవత్సరం. అత్యవసర పనుల నిమిత్తం బ్రేక్ లేకుండా పనులు చేయించాల్సి వస్తే, యజమాని కార్మికులకు తగిన సౌకర్యాలు కల్పించాలనీ, ఎండ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో పనిచేయనివ్వరాదనీ స్పష్టమైన ఆదేశాలున్నాయి. గత సంవత్సరం 65,000 ఇన్‌స్పెక్షన్స్ జరిగాయి. కేవలం 58 నిబంధనల ఉల్లంఘనలు మాత్రమే చోటుచేసుకున్నాయి.
తాజా వార్తలు
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







