ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు..
- May 19, 2016
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు కొన్నిచోట్ల ఊహించినట్లుగానే రాగా.. తమిళనాడులో మాత్రం ఎవరూ ఊహించని విధంగా అన్నాడీఎంకే రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమైంది. పశ్చిమబెంగాల్లో ఇంతకుముందు 2011లో జరిగిన ఎన్నికలలో ఇతర పార్టీలతో కూటమిగా పోటీ చేసినప్పటి కంటే, ఈసారి ఒంటరి పోటీలోనే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధిస్తోంది. దాదాపు మూడింట రెండొంతుల మెజారిటీకి దగ్గరగా ఉంది. అసోంలో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న సీఎం తరుణ్ గొగోయ్‌ను కాదని, బీజేపీ నేత శర్వానంద సోనోవాల్‌కు ప్రజలు పట్టంగట్టారు. అలాగే కేరళలో అవినీతి ఆరోపణలలో కూరుకుపోయిన ఊమెన్ చాందీని దించి, ఎల్డీఎఫ్ కూటమిని గెలిపించారు. పుదుచ్చేరిలో మాత్రం హంగ్ అసెంబ్లీ ఏర్పడేలా ఉంది. వివిధ రాష్ట్రాలలో ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి..
పశ్చిమబెంగాల్ (294)
పార్టీ ఆధిక్యం గెలుపు
టీఎంసీ 62 154
లెఫ్ట్ 32 38
బీజేపీ 0 7
ఇతరులు 0 1
అసోం (126) ఆధిక్యం గెలుపు
బీజేపీ 37 51
కాంగ్రెస్ 15 08
ఏఐయూడీఎఫ్ 5 6
ఇతరులు 2 2
తమిళనాడు (234) ఆధిక్యం గెలుపు
అన్నాడీఎంకే 104 32
డీఎంకే 75 21
ఇతరులు 0 0
డీఎండీకే 0 0
కేరళ (140) ఆధిక్యం గెలుపు
ఎల్డీఎఫ్ 0 88
యూడీఎఫ్ 0 50
బీజేపీ 0 1
ఇతరులు 0 0
పుదుచ్చేరి (30) ఆధిక్యం గెలుపు
కాంగ్రెస్ 4 13
ఏఐఎన్ఆర్సీ 0 8
అన్నాడీఎంకే 1 3
ఇతరులు 0 1
తాజా వార్తలు
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్







