నిద్రాణ స్థితిలోకి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు: ఇస్రో ట్వీట్
- September 04, 2023
బెంగళూరు: విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు నిద్రాణస్థితిలోకి వెళ్లాయి. విక్రమ్ ల్యాండర్ గం.08:00 సమయంలో స్లీప్ మోడ్‌లోకి వెళ్లేలా సెట్ చేయబడినట్లు ఇస్రో ట్వీట్ చేసింది. పేలోడ్స్ స్విచ్ ఆఫ్ చేయబడ్డాయని, ల్యాండర్ రిసీవర్లను ఆన్‌లో ఉంచినట్లు పేర్కొంది. సోలార్ పవర్ తగ్గి, బ్యాటరీ అయిపోయాక ప్రజ్ఞాన్ పక్కనే విక్రమ్ రోవర్ నిద్రాణస్థితిలోకి వెళ్తుందని వెల్లడించింది. తిరిగి సెప్టెంబర్ 22, 2023న అవి తిరిగి పని చేస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొంది. శివశక్తి పాయింట్ వద్ద 22న సూర్యోదయం అవుతుంది. అప్పుడు సూర్యకాంతితో రోవర్ యాక్టివేట్ అయ్యేలా సోలార్ ప్యానెల్‌ను మార్చినట్లు ఇస్రో తెలిపింది. రోవర్ రిసీవర్లను ఆన్‌లో ఉంచినట్లు తెలిపింది.
అంతకుముందు రోవర్ మళ్లీ విజయవంతంగా ల్యాండ్ అయినట్లు ఇస్రో ట్వీట్ చేసింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై మరోసారి సురక్షితంగా ల్యాండ్ అయినట్లు వెల్లడించింది. చంద్రయాన్-3 మిషన్ కోసం నిర్దేశించిన లక్ష్యాలను మించి విక్రమ్ పనితీరును కనబరిచిందని, అది విజయవంతంగా హాప్ ఎక్స్‌పెరిమెంట్‌ను పూర్తి చేసిందని తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







