బహ్రెయిన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

- September 05, 2023 , by Maagulf
బహ్రెయిన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

బహ్రెయిన్: ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాల మధ్య సంబంధాలు ఊపందుకుంటున్నాయి. బహ్రెయిన్ మరియు ఇజ్రాయెల్ వాణిజ్య సంబంధాలు,  పరస్పర సహకారాన్ని పెంచుకోవడానికి అంగీకరించాయి. మరోవైపు బహ్రెయిన్‌లో కొత్త రాయబార కార్యాలయాన్ని ఇజ్రాయెల్ ప్రారంభించింది. 2021లో ఏర్పాటు చేసిన దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 15, 2020న బహ్రెయిన్, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సూడాన్ మరియు మొరాకోలతో వాషింగ్టన్‌లో కుదిరిన అబ్రహం ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

రెండు దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని అభివృద్ధి చేయడానికి కుదిరిన రెండు అవగాహన ఒప్పందాల (MOUలు)పై బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డా. అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్-జయానీ , ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ సంతకం చేశారు.  ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్, యువజన వ్యవహారాలలో సహకారం కోసం మంత్రులు రెండు ఉమ్మడి ఒప్పందాలపై  సంతకం చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ మంత్రి మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాల సంఖ్యను పెంచడంతోపాటు వాణిజ్య పరిమాణం,  పెట్టుబడులను పెంచడానికి కృషి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com