భారత్ జోడో యాత్ర రెండో షెడ్యూల్డ్ ప్రకటించిన కాంగ్రెస్
- September 06, 2023న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ నాయకత్వంలో కొనసాగే భారత్ జోడో యాత్రం రెండో దశకు సంబంధించిన పూర్తి షెడ్యూల్డ్ ను కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించింది. గురువారం (సెప్టెంబర్ 7) ప్రారంభం కానున్న ఈ యాత్ర వచ్చే ఏడాది జనవరి 30 వరకు సాగుతుందని ఆ పార్టీ పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాలకు కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,081 కిలోమీటర్ల పాటు యాత్రం సాగుతుందని పేర్కొన్నారు.
ఈ విషయమై కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పటోలే మాట్లాడుతూ.. “రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండవ దశ గుజరాత్ నుంచి మేఘాలయ వరకు ఉంటుంది. పశ్చిమ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రముఖ కాంగ్రెస్ నేతలు పాదయాత్రలకు నాయకత్వం వహిస్తారు’’ అని తెలిపారు. తొలి విడత యాత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపు 4,000 కిలోమీటర్లు నడిచింది. అయితే ఇది ముగిసిన చాలా రోజులకు రాహుల్ యాత్ర ప్రారంభించారు. గుజరాత్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ వరకు సాగనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక రాహుల్ భారత్ జోడో యాత్రకు అనుగుణంగా మహారాష్ట్రలోని పార్టీ నేతలు సమాంతర పాదయాత్ర నిర్వహిస్తారని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- IIFA ఉత్సవం.. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం..
- జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం.. అథారిటీ కీలక అప్డేట్ జారీ..!!
- ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- రియాద్ లైట్ ఫెస్టివల్ 2024.. నవంబర్ 28న ప్రారంభం..!!
- కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!
- ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- చరిత్ర సృష్టించిన టీమిండియా, ఆసియా హాకీ ట్రోఫీ విజేతగా భారత్
- ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాల గురించి తెలుసా..?