వేడి నీటితో రోజును ప్రారంభిస్తే.. ఎన్ని ఉపయోగాలో తెలుసా.?

- September 06, 2023 , by Maagulf
వేడి నీటితో రోజును ప్రారంభిస్తే.. ఎన్ని ఉపయోగాలో తెలుసా.?

చాలా మందికి ఉదయం లేవగానే వేడి నీరు తాగే అలవాటుంటుంది. ఆ అలవాటున్న వారికి ఆయుష్షు పెరుగుతుందని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
అదేంటీ.! వేడి నీళ్లు తాగితే ఆయుష్షు పెరుగుతుందా.? అనే అనుమానాలు తలెత్తొచ్చు. అవునండీ నిజమే.! ఉదయాన్నే వేడి నీరు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయట.
ముఖ్యంగా గుండెకు సంబంధించిన రోగాలు ఏమీ దరి చేరవట. అలాగే, జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుందట. గుండె ఆరోగ్యంగా వుండి.. ఏది తిన్నా ఇట్టే జీర్ణమయ్యేలా జీర్ణ శక్తి బాగుంటే ఇక, అంతకన్నా మించిన ఆరోగ్యం ఇంకేముంటుంది చెప్పండి.
అలాగే, మలబద్ధకం సమస్య వుంటే అది కూడా తగ్గిపోతుందట. మలబద్ధకానికి అనేక రకాల మందులు వాడుతుంటాం. కానీ, అవన్నీ టెంపరరీ సొల్యూషన్స్‌గానే పని చేస్తాయ్.
కానీ, వేడి నీటి చికిత్స మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందని అంటున్నారు. అంతేకాదు, వయసు మీద పడుతున్నా చర్మం ముడతలు బారకుండా వుండేందుకు కూడా వేడి నీరు ఉపకరిస్తుందట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com