‘రూల్స్ రంజన్’తో కిరణ్ అబ్బవరానికి గోల్డెన్ హిట్ పడనుందా.?
- September 06, 2023‘రాజావారు రాణివారు’ సినిమాతో హీరోగా పరిచయమై, ఆ తర్వాత ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ తదితర చిత్రాలతో సూపర్ హిట్టు కొట్టి అనతి కాలంలోనే అనూహ్యంగా స్టార్ డమ్ దక్కించుకున్న యంగ్ స్టర్ కిరణ్ అబ్బవరం.
అయితే ఆ తర్వాత కాస్త స్లో అయ్యాడీ కుర్ర హీరో. కిరణ్ అబ్బవరం తాజా చిత్రానికి ‘రూల్స్ రంజన్’ అని టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్‌లో రిలీజ్ కావల్సి వుండగా, సెప్టెంబర్ 28కి ప్రీ పోన్ అయ్యింది. ఇదే డేట్‌లో రిలీజ్ కావల్సిన ‘సలార్’ పోస్ట్‌పోన్ కావడంతో, ‘రూల్స్ రంజన్’ ఈ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది.
కాగా, ‘బెదురులంక’ సినిమాతో ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురు చూస్తున్న కార్తికేయకు సూపర్ హిట్ దక్కింది. దీనంతటికీ కారణం హీరోయిన్ నేహా శెట్టి అదృష్టమే అని ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ అదే అదృష్టం మనోడికీ కలిసొస్తే, ‘రూల్స్ రంజన్’ పెద్ధ హిట్ అయిపోయే అవకాశాలున్నాయ్. ఈ సినిమా రిలీజ్ టైమ్ కూడా హాలీడేస్ కలిసొచ్చే టైమ్ కావడంతో, కిరణ్ అబ్బవరం దశ తిరగబోతోందంటున్నారు. నేహాశెట్టిలో హిట్టు కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
సో, ‘రూల్స్ రంజన్’ హిట్టు.. సూపర్ హిట్టు అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువే అని అంచనాలు వేస్తున్నారు.
తాజా వార్తలు
- జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం.. అథారిటీ కీలక అప్డేట్ జారీ..!!
- ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- రియాద్ లైట్ ఫెస్టివల్ 2024.. నవంబర్ 28న ప్రారంభం..!!
- కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!
- ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- చరిత్ర సృష్టించిన టీమిండియా, ఆసియా హాకీ ట్రోఫీ విజేతగా భారత్
- ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాల గురించి తెలుసా..?
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్