వరుణ్ హీరోయిన్‌ని పక్కకు నెట్టేసిన శ్రీలీల.!
- September 06, 2023
మొన్న ‘గుంటూరు కారం’ సినిమాకి సంబంధించి పూజా హెగ్ధే ప్లేస్‌ని పట్టేసింది అనూహ్యంగా శ్రీలీల. ఇప్పుడు మరో హీరోయిన్ రోల్‌కీ ఎసరు పెట్టేసింది. ఆల్రెడీ తెలిసిన ముచ్చటే అయినా.. అందులోని లోతు లేట్‌గా బయటికి వచ్చింది.
ప్రస్తుతం శ్రీలీల నటిస్తున్న సినిమాల్లో ‘స్కంధ’ ఒకటి. ఈ సినిమాలో శ్రీలీలే హీరోయిన్‌గా ఇంతవరకూ ప్రొజెక్ట్ అవుతూ వచ్చింది. అయితే, ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా వుంది.
ఆమె పేరు సాయి మంజ్రేకర్. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘గని’ సినిమాలో హీరోయిన్ ఈ సాయి మంజ్రేకర్. ‘స్కంధ’ సినిమాకి మెయిన్ లీడ్ హీరోయిన్‌గా సాయి మంజ్రేకర్‌నే ఎంపికైంది. ఆమెతో లీడ్ సీన్లు మొదట కొన్ని తెరకెక్కించారు కూడా.
అయితే, ఇంతలో శ్రీలీల ఈ ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో, ఆమె క్యారెక్టర్ సైడ్ అయిపోయింది. శ్రీలీలకున్న క్రేజ్‌తో సాయి మంజ్రేకర్‌ని సెకండ్ హీరోయిన్‌గా చేసి, శ్రీలీలకు మొదటి ప్లేస్ ఇచ్చేశారట. లేట్‌గా ఈ విషయం బయటికొచ్చింది.
మొత్తానికి టాలీవుడ్‌లో శ్రీలీల కారణంగా దెబ్బయిపోతున్న హీరోయిన్ల లిస్టు అంతకంతకూ పెరిగిపోతున్నట్లే కనిపిస్తోంది.
తాజా వార్తలు
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం







