సెప్టెంబర్ 10న భారత్, పాక్ మ్యాచ్..
- September 06, 2023
కొలంబో: ఆసియాకప్ 2023లో మ్యాచులకు వరుణుడు అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే. పలు మ్యాచులకు వర్షం అంతరాయం కలిగించడంతో డక్త్ లూయిస్ పద్దతిలో మ్యాచులను నిర్వహించారు. అయితే.. ఇంకొన్ని మ్యాచులు రద్దు అయ్యాయి. అందులో క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూసిన భారత్, పాక్ మ్యాచ్ ఒకటి. దీంతో వేదికలను మార్చాలనే డిమాండ్లు సోషల్ మీడియాలో మొదలయ్యాయి.
ఆసియా కప్2023లో గ్రూప్ స్టేజీ ముగిసింది. నేటి నుంచి సూపర్-4 దశ మొదలైంది. అయితే.. సూపర్-4లో మ్యాచులు జరగనున్న కొలంబోలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సూపర్-4లో భాగంగా భారత్, పాకిస్తాన్ లు సెప్టెంబర్ 10న తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అవుతుందేమోనని భయాందోళనలు వ్యక్తం అవుతుండగా శ్రీలంక వాతావరణశాఖ అధికారి ఒకరు ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పారు.
శ్రీలంక వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ అతుల కరుణానాయక్ మాట్లాడుతూ టోర్నీ ఆఖరి దశలో మ్యాచులకు వర్షం ముప్పు తక్కువేనని చెప్పారు. సెప్టెంబర్ 9 తరువాత కొలంబోలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని, ఒక వేళ వర్షం పడినా చిరుజల్లులు మాత్రమే పడతాయన్నారు. ఆయన చెబుతున్న దాన్ని బట్టి చూస్తే సెప్టెంబర్ 10న దాయాదుల మధ్య పోరు సజావుగా సాగే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచ్‌కు సైతం కొలంబోనే ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 10న పాకిస్తాన్‌తో తలపడనున్న భారత్, ఆ తరువాత సెప్టెంబర్ 12న శ్రీలంకతో, సెప్టెంబర్ 15న బంగ్లాదేశ్‌తో మ్యాచులు ఆడనుంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







