వ్యాట్ ద్వారా ఒమాన్ కు 250 మిలియన్ ఆదాయం
- May 19, 2016
వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఒమన్ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని, ఇది 250 మిలియన్ ఒమన్ రియాల్స్ వరకు ఉంటుందని ఓ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అంచనా వేశారు. మినిస్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫైనాన్షియల్ బఎఫైర్స్ దర్విష్ బిన్ ఇస్మాయిల్ బిన్ అలి అల్ బలుషి, 2018 నుంచి వ్యాట్ని జీసీసీ దేశాల్లో అమలు చేస్తామని గతంలోనే ప్రకటించారు. గ్రాండ్ హయాత్ మస్కట్లో ఒమన్ వాట్పై జరిగిన సెమినార్లో ఎర్న్స్ట్ అండ్ యంగ్ (ఇవై) మేనేజింగ్ పార్టనర్ అహ్మద్ అమోర్ ఎల్ ఎస్రీ మాట్లాడుతూ, వ్యాట్ ద్వారా 250 మిలియన్ ఒమన్ రియాల్స్ జనరేట్ అవుతుందనీ, ఇది ఒమన్ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో వ్యాపార వర్గాలు వ్యాట్ ఇంప్లిమెంటేషన్పై ఇప్పటినుంచే అవగాహనకు రావాల్సి వుందని, తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. వ్యాట్ వసూళ్ళకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా రావాల్సి ఉన్నందున, వాటికి అనుగుణంగా వ్యాపార వర్గాలు వ్యవహరించాలని ఇవై డైరెక్టర్ ఆఫ్ ట్యాక్స్ అడ్వైజరీ సర్వీసెస్ అల్కేష్ జోషి చెప్పారు. ఫుడ్ ఐటమ్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ మరియు కొన్ని ఆర్థిక సంబంధమైన సర్వీసులపై వ్యాట్ వుండకపోవచ్చు గనుక, సామాన్యులపై వ్యాట్ ప్రభావం తక్కువగానే ఉంటుందని నిపుణులు అంచనా వేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







