ఇండియా-ఒమన్ ఫ్లైట్లో గుండెపోటుతో ప్రయాణీకుడు మృతి
- September 12, 2023
న్యూఢిల్లీ: ఇండియా-ఒమన్ ఫ్లైట్లో గుండెపోటుతో ఓ ప్రయాణీకుడు మృతి చెందారు. మృతుడిని K ధనశేఖరన్ (38)గా గుర్తించారు. ఆయన మస్కట్ నుండి చెన్నైకి తిరిగి వస్తుండగా విమానం గాలిలో ఉండగానే గుండెపోటుతో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మస్కట్‌లో పని చేస్తున్న ధనశేఖరన్ సెలవుల కోసం ఇంటికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత, మిగతా ప్రయాణికులందరూ విమానం నుంచి దిగిన తర్వాత కూడా ధనశేఖరన్ అలాగే కూర్చున్నట్లు ప్లైట్ సిబ్బంది గుర్తించారు. అతను నిద్రపోతున్నాడని భావించిన క్యాబిన్ సిబ్బంది అతన్ని లేపేందుకు ప్రయత్నించారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో సిబ్బంది అతడిని తనిఖీ చేయగా అపస్మారక స్థితిలో ఉన్నాడు. అనంతరం పరిస్థితిని గమనించి అధికారులను అప్రమత్తం చేశారు. విమానాశ్రయంలోని అత్యవసర వైద్య కేంద్రానికి తరలించారు. కానీ, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







