వాహనదారులకు దుబాయ్ ట్రాఫిక్ విభాగం హెచ్చరికలు
- September 12, 2023
యూఏఈ: దుబాయ్ ట్రాఫిక్ విభాగం వాహనదారులకు హెచ్చరిక జారీ చేసింది. దుబాయ్ లోని ఓ ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగిన తర్వాత అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో అధికారులు వాహనదారులకు అలెర్ట్ జారీ చేశారు. ప్రమాదం గురించి వాహనదారులను హెచ్చరించడానికి అధికారులు X (ట్విటర్) ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో పలు కీలక అంశాలపై వాహనదారులకు సూచనలు చేశారు. లతీఫా బింట్ హమ్దాన్ బ్రిడ్జి నుంచి జెబెల్ అలీ వైపు వస్తున్న అల్ ఖైల్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. ఈ ఏరియాలో వాహనాలు నడిపేటప్పుడు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ప్రకటనలో కోరారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







