మోడీ ప్రభుత్వం పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు
- September 13, 2023
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి మోడీ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. ప్రధాని మోడీ చేస్తోంది కరక్టేనంటూ కితాబిచ్చారు. రష్యాలో జరిగిన 8వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ కార్యక్రమంలో పాల్గొన్న పుతిన్ ‘మేక్ ఇన్ ఇండియా’ విధానాన్ని ప్రస్తావించారు. రష్యాలో తయారైన కార్లనే రష్యన్లు వినియోగించాలని పుతిన్ సూచించారు. దేశీ ఉత్పత్తుల వినియోగానికి సంబంధించి మోడీ ఇప్పటికే తన విధానాల ద్వారా గొప్ప ఉదాహరణలు నెలకొల్పారని ఫోరమ్‌ను ఉద్దేశిస్తూ పుతిన్ ప్రసంగించారు.
‘‘గతంలో రష్యాలో తయారైన కార్లు మనకు అందుబాటులో ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఉన్నాయి. అవి చూడటానికి కాస్తంత సాధారణంగా కనిపించొచ్చు. ఆడీ, బెంజ్ కార్లలా ఉండకపోవచ్చు. కానీ దీన్నో సమస్యగా చూడకూడదు. మనం ఇండియా లాంటి దేశాలు అవలంబిస్తున్న విధానాలను పాటించాలి. దేశీయంగా వాహనాలు తయారు చేయడంపై వారు దృష్టి పెట్టారు. మేక్ ఇన్ ఇండియా విధానాన్ని ప్రోత్సహిస్తూ ప్రధాని మోడీ సరైన పనే చేస్తున్నారనేది నా అభిప్రాయం’’ అని పుతిన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు







