నాగఅన్వేష్ కి జోడిగా హెబ్బాపటేల్
- May 20, 2016
వినవయ్యా రామయ్య ఫేమ్ నాగ అన్వేష్ రెండో సినిమా పనులు శరవేగంగా జరుతున్నాయి. సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై సింధురపువ్వు కృష్ణారెడ్డి నిర్మాతగా రాజమౌళి శిష్యుడు 'బాహుబలి' పళని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలో సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో నాగఅన్వేష్ సరసన హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు 'ఏంజిల్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బాలనటుడిగానే కాక తొలిచిత్రంతోనే హీరోగాను మెప్పించిన నాగ అన్వేష్ ఈసారి ఓ వినూత్నమైన స్టోరీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. యాక్షన్, కామెడీ, లవ్, సెంటిమెంట్ ఇలా నవరసాలు సమపాల్లలో ఉండే విధంగా ఈ చిత్రం రూపొందనుంది. అలానే నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జోడీ యూత్ కి ఫుల్ కిక్ ఇస్తోందని చిత్ర బృందం చెబుతోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని దర్శకనిర్మాతలు తెలియజేశారు..
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







