దుబాయ్ కస్టమ్స్: వికలాంగులకు 2.5 శాతం ఉద్యోగావకాశాలు
- May 20, 2016
వికలాంగులకు 2.5 శాతం ఉద్యోగాల్ని దబాయ్ కస్టమ్స్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే కెరీర్స్ యూఏఈ 2016 ఎగ్జిబిషన్లో 128 వేకెన్సీస్ని ఇప్పటికే ప్రకటించిన దుబాయ్ కస్టమ్స్ వాటికి అదనంగా ఈ పోస్టుల్ని సిద్ధం చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కెరీర్స్ యూఏఈ 2016 లో దుబాయ్ కస్టమ్స్ స్టాండ్స్‌కి 1000 అప్లికేషన్స్ వచ్చాయనీ, వీటిలో వ్యక్తిగతంగా 403 అప్లికేషన్స్ రాగా, 597 అప్లికేషన్లు ఇ-మెయిల్ ద్వారా వచ్చాయని ఆ అధికారి వివరించారు. అక్కడికక్కడే 40 మందిని ఇంటర్వ్యూ చేసి 16 మందిని ఎంపిక చేశామనీ, అతి త్వరలో వారు విధులకు హాజరవుతారని చెప్పారు. దుబాయ్ కస్టమ్స్ ప్రస్తుతం 10 మంది డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్‌ని కలిగి ఉందని దుబాయ్ కస్టమ్స్ ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ - హ్యూమన్ రిసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహ్మద్ ఒబైద్ అల్ పలాసి వివరించారు. యాంబిషన్, ఎమిరైటేజేషన్ ఎక్సలెన్స్ అనే మోటివ్తో ఉద్యోగాల భర్తీ ప్రకియ చేపడ్తున్నట్లు వివరించారాయన.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







