రూ.172 కోట్ల వ్యయంతో విశాఖలో 'యూనిటీ మాల్'
- September 20, 2023
విశాఖపట్నం: చేనేత, హస్తకళలకు మెరుగైన మార్కెటింగ్ ధ్యేయంగా విశాఖపట్నంలో యూనిటీ మాల్ నిర్మించనున్నట్లు పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మధురవాడ గ్రామంలోని సర్వే నెం.426/2లోని 5 ఎకరాల స్థలంలో యూనిటీ మాల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పరిశీలానకి పంపుటకు కాబినెట్ నిర్ణయించింది . యూనిటీ మాల్ నిర్మాణం కోసం రూ.172 కోట్లు వ్యయం చేయనున్నామని, “స్కీమ్ ఫర్ స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ 2023-24” పధకం కింద కేంద్ర ప్రభుత్వం వడ్డీ రహిత రుణాన్ని అందించిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ వివరించారు. ఎపి సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్' 2001 కింద యూనిటీ మాల్ రిజిస్ట్రేషన్ వ్యవహారాలను పూర్తి చేసుకుందన్నారు. ప్రధానంగా చేనేత ఉత్పత్తులకు జాతీయ స్ధాయి మార్కెటింగ్ వేదికలను అందించే క్రమంలో ఈ బహుళ ప్రయోజక మాల్ ను సాధ్యమైనంత వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. విశాఖ యూనిటీ మాల్ లో అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, సాంస్కృతిక సందడి కోసం ఒక కన్వెన్షన్ సెంటర్‌ను సిద్ధం చేయనున్నామన్నారు. ఈ ప్రాంగణాన్ని కార్పొరేట్ సంస్ధలు కూడా ఉపయోగించుకోవచ్చని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
సంస్కృతి, వారసత్వంతో ముడిపడి ఉన్న పర్యాటక ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తులకు ఇది ఒక మైలురాయి వంటిదన్నారు. ప్రతి రాష్ట్రానికి సంబంధించిన చేనేత, చేతి వృత్తుల ప్రదర్శనలకు అనుకూలంగా, 26 స్టాల్స్ అందుబాటులో ఉంటాయన్నారు. ఇది దేశీయ, విదేశీ పర్యాటకులకు రాష్ట్ర చరిత్ర, సంస్కృతిని హైలైట్ చేస్తూ హస్తకళ, చేనేత ఉత్పత్తులను సంరక్షణ, పునరుద్ధరణకు సహాయపడుతుందని తెలిపారు. కమర్షియల్ స్పేస్‌లు, కన్వెన్షన్ సెంటర్‌లు, ఫుడ్ కోర్ట్‌ల నుండి వచ్చే ఆదాయాల ద్వారా యూనిటీ మాల్ నిర్వహణకు అవసరమైన నిధులను స్వయంగా సమకూర్చుకోగలుగుతుందన్నారు. యూనిటీ మాల్ లో ఆడిటోరియం, మ్యూజియం/ ఆర్ట్ గ్యాలరీ, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఫుడ్ కోర్ట్, రిటైల్ అవుట్‌లెట్ లు, శిక్షణ కేంద్రం, పరిపాలనా విభాగం, వినోద ప్రాంగణాలు, విశాలమైన పార్కింగ్ సౌకర్యాలు వంటి సౌకర్యాలు ఉంటాయని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







