మక్కా, మదీనాలలో 100కి పైగా చారిత్రక ప్రదేశాల అభివృద్ధి

- September 20, 2023 , by Maagulf
మక్కా, మదీనాలలో 100కి పైగా చారిత్రక ప్రదేశాల అభివృద్ధి

మక్కా: మక్కా, మదీనాలలో 100 కంటే ఎక్కువ చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేసే ప్రణాళికలను సౌదీ హజ్చ ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫిక్ అల్-రబియా ఆవిష్కరించారు. మంత్రిత్వ శాఖ, అనేక ఏజెన్సీల భాగస్వాములతో సహకారంతో ఈ చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుందని తెలిపారు. హజ్ మరియు ఉమ్రా యాత్రికుల అనుభవాలను మెరుగుపరచడానికి డోయోఫ్ ఆఫ్ అల్-రెహ్మాన్ ప్రోగ్రాం చేపట్టినట్లు వివరించారు. సోమవారం మక్కాలోని హీరా కల్చరల్ నైబర్‌హుడ్‌లో "పార్టనర్స్" అనే కార్యక్రమంలో అల్-రబియా పాల్గొని ప్రసంగించారు. మక్కాలోని చారిత్రక మరియు సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించడానికి టిక్కెట్ల బుకింగ్ కోసం ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించినట్లు మంత్రి ప్రకటించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com