రెజీనా మనసు మార్చుకుందా.?

- September 21, 2023 , by Maagulf
రెజీనా మనసు మార్చుకుందా.?

సినిమాల్లో లాభం లేదంటూ ఓటీటీ బాట పట్టింది ఇటీవల అందాల భామ రెజీనా. ఓటీటలో పాత్రకు ప్రాధాన్యత వున్న కంటెంట్స్ సెలెక్స్ చేసుకుంటూ తనదైన గుర్తింపు దక్కించుకుంది. 

ఓటీటీలో రెజీనాని చూసిన బాలీవుడ్ మేకర్లు కొన్ని ఆఫర్లు కూడా ఇచ్చారు రెజీనాకి. అందులో భాగంగానే ‘సెక్షన్ 108’ అనే సినిమాలో నటిస్తోంది. 

అదలా వుంటే, తాజాగా ఓ హారర్ మూవీలో రెజీనా ఛాన్స్ దక్కించుకుంది. తెలుగుతో పాటూ పలు ఇతర భాషల్లోనూ ఈ సినిమా తెరకెక్కబోతోంది.

సెల్విన్ రాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో ఇంతవరకూ ఎప్పుడూ తెరపై చూడని హారర్ కథాంశాల్ని చిత్రీకరించబోతున్నారట. 

హాలీవుడ్ రేంజ్‌లో మేకింగ్ వుండబోతోందనీ అంటున్నారు. ఏరి కోరి ఈ సినిమా కోసం రెజీనాని ఎంచుకోవడం విశేషం. గ్లామర్ తారగా పేరు తెచ్చుకున్న రెజీనా.. ఓటీటీ పుణ్యమా అని యాక్షన్ గాళ్‌గా మారిపోయింది.

తాజా సినిమాతో వెండితెరపై మరోసారి కొత్తగా సరికొత్తగా వెలుగులు విరజిమ్మేందుకు సిద్ధమవుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com