యూఏఈ-ఇండియా మధ్య 'ఓపెన్ స్కైస్' విధానానికి ఫ్లైదుబాయ్ సీఈఓ పిలుపు
- September 21, 2023
యూఏఈ: దుబాయ్‌కి చెందిన క్యారియర్ ఫ్లైదుబాయ్ సీఈఓ ఘైత్ అల్ ఘైత్.. యూఏఈ, ఇండియా మధ్య 'ఓపెన్ స్కైస్' పాలసీకి పిలుపునిచ్చారు. ఈ ఏర్పాటు రెండు దేశాలలో పర్యాటకాన్ని పెంచడానికి ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఇటీవలి ఓ మీడియాలో మాట్లాడుతూ.. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్లైదుబాయ్ ఈ సంవత్సరం జూన్ నుండి సెప్టెంబరు మధ్య వరకు నాలుగు మిలియన్లకు పైగా ప్రయాణీకులకు సేవలు అందించినట్లు తెలిపారు. భారతదేశం పెద్ద మార్కెట్ అని, ఇప్పుడు యూఏఈ, భారతదేశం మధ్య వాణిజ్య కారిడార్ ఉన్నందున, విమానయాన రంగాన్ని కూడా సరళీకృతం చేయాలని ఆయన సూచించారు. 'ఓపెన్ స్కైస్' ఒప్పందం అనేది విదేశీ విమానయాన సంస్థలకు జాతీయ విమానాశ్రయాలకు యాక్సెస్ మంజూరు చేయడం. ఇది ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలు, సీట్లు మరియు నగరాలకు విమానయాన సంస్థలు సేవలందించే పరిమితులను తొలగిస్తుంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్







