అమరావతిని ప్రఖ్యాత నగరంగా నిర్మిస్తాం: సిఎం చంద్రబాబు నాయుడు
- May 20, 2016
అమరావతిని ప్రపంచంలోని 10 అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ అన్నారు. ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు రచించిన 'ఆమరావతి ప్రభువు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు' పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాతవాహనాల కాలంలోనే అమరావతి ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా వెలుగొందిందన్నారు. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న ప్రాంతాన్ని తర్వాతి కాలంలో పరిపాలించిన వేంకటాద్రి నాయుడు గురించి పుస్తకం తీసుకురావటం అభినందనీయమన్నారు.
గతంలో అమరావతి ఎక్కడుందో కూడా ఎవరికీ తెలిసేది కాదని.. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని గురించి చర్చ మొదలైందన్నారు. రాజధానిలో భవనాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు తగ్గట్లుగా ఉండాలనే ఉద్దేశంతో దేశీయ రూపశిల్పులతో ఆకృతులు తయారు చేయిస్తున్నట్లు వివరించారు. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకలా అమరావతి నిలుస్తుందన్నారు. ఈ ప్రాంతం నుంచే బుద్దిజం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిందని.. అందుకే అమరావతిలో అంతర్జాతీయ బుద్ధిజం పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన వారసత్వ సంపద లండన్ మ్యూజియంతో పాటు చెన్నై, హైదరాబాద్‌లోని ప్రదర్శనశాలల్లో ఉందని.. దాన్ని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. రాజధానికి అమరావతి పేరును రామోజీరావు సూచించారని. ఈ పేరు వెనక ఉన్న చరిత్రను, వివరాలను తనకు పంపారని సీఎం గుర్తు చేసుకున్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







