మూడు కొత్త చిత్రాలకు ఓకే చెప్పిన మంచు మనోజ్
- May 20, 2016
హీరో మంచు మనోజ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు సోషల్మీడియా ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరికి మనోజ్ థ్యాంక్స్ చెబుతూ... తను నటించబోయే మూడు కొత్త చిత్రాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించారు.
సీతా మహాలక్ష్మి(మదర్ ఆఫ్ ర్యాంబో) ఈ చిత్రానికి సాగర్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నారు. మంచు మనోజ్ కుమార్ హీరోగా నటిస్తూ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. కెమెరా: సూర్య, స్టోరీ: కిషోర్ గొపు, డైలాగ్స్: భవాని ప్రసాద్, ఎడిటర్: పి. టైగర్, స్టంట్స్: మంచు మనోజ్ కుమార్.
రెండో చిత్రం మనోజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.కె. సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీవరుణ్ అట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా ఈ చిత్రం టైటిల్ ఖరారు చేయలేదు.
మూడో చిత్రం ఎస్.ఎన్.ఆర్ ఫిల్మ్స్ ప్రై.లి అండ్ న్యూ ఎంపైర్ సెల్యులాయిడ్స్ పతాకంపై ఎస్.ఎన్. రెడ్డి, ఎన్. లక్ష్మికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. అచ్చిబాబు సమర్పిస్తున్నారు. కెమెరామెన్: వి.కె. రామ రాజు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్. ఈ చిత్రం టైటిల్ను ఇంకా నిర్ణయించలేదు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







