ఆంధ్రప్రదేశ్ సర్కారు పై బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి సాధినేని యామి ఫైర్
- September 24, 2023
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సర్కారు పై బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ మండిపడ్డారు. ఇవాళ విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… సీఎం జగన్ మద్యం అక్రమాలను తమ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆధారాలతో చూపిస్తే తట్టుకోలేకపోయారని చెప్పారు.
ఏపీలో జరుగుతున్న అవినీతి, పెరిగిపోతున్న అప్పుల గురించి పురందేశ్వరి వివరించారని, దీంతో తట్టుకోలేక వైసీపీ నాయకులతో జగన్ తిట్టిస్తున్నారని సాధినేని యామిని శర్మ అన్నారు. ప్రజలకు మంచి పాలన అందిస్తారని వైసీపీకి అధికారం ఇచ్చారని, అది మరచి వైసీపీ నాయకులు నీచంగా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రజలు జగన్ పాలన ఎప్పుడు పోతుందని ఎదురు చూస్తున్నారని చెప్పారు. జగన్ ప్రభుత్వానిది అసమర్థ పాలన అని విమర్శించారు.
అనంతరం బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజి మాట్లాడుతూ… ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మద్యం ఏరులై పారుతోందని చెప్పారు. రోడ్డు పక్కన టీ తాగినా అక్కడ ఫోన్ పేలో డబ్బులు చెల్లించవచ్చని, వందలు, వేల రూపాయలు పెట్టి కొన్న మద్యం సీసాలకు చెల్లించడానికి మాత్రం ఫోన్ పేని అందుబాటులో ఉంచడం లేదని విమర్శించారు. అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







