యాత్ర 2 మొదలైంది..
- September 24, 2023
మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా 2019 ఎన్నికల సమయంలో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘యాత్ర’. మలయాళ హీరో మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటించాడు. ఇక ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ ని తీసుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మహీ వి రాఘవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సెకండ్ పార్ట్ ని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కథ ఆధారంగా తెరకెక్కించబోతున్నాడు.
ఇక ఈ సినిమాలో జగన్ పాత్రలో ఎవరు నటిస్తారు అని అందరిలో ఆసక్తి నెలకుంది. ముందు నుంచి ఈ మూవీలో జగన్ రోల్ ని తమిళ నటుడు ‘జీవా’ నటిస్తాడు అంటూ వార్తలు వినిపిస్తూ వచ్చాయి. దీని గురించి దర్శకుడిని ప్రశ్నించినా.. జవాబు రాలేదు. అయితే ఈ మూవీలో జీవా ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తుంది. ఆల్రెడీ మూవీ కూడా మొదలైనట్లు సమాచారం. తాజాగా జీవా.. జగన్ గా నటిస్తున్న ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో జీవా జగన్ గెటప్ లో కనిపించి ఆయనలా నటిస్తూ కనిపిస్తున్నాడు.
అయితే ఇది స్టిల్ ఫోటోషూట్ అని తెలుస్తుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. జగన్ గా జీవా కరెక్ట్ గా సెట్ అయ్యాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని V సెల్యులాయిడ్స్, త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కల్కి 2898 AD మూవీకి సంగీతం అందిస్తున్న సంతోష్ నారాయణ్ ఈ యాత్ర 2కి మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. 2024 ఫిబ్రవరిలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఎన్నికల లక్ష్యంగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుంది. మరి ఈ చిత్రం ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







