వ్యవసాయ రంగంలో 20,000 ఉద్యోగాలను సృష్టించడం యూఏఈ లక్ష్యం
- September 24, 2023
యూఏఈ: ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగాల సహకారం $10 బిలియన్లు (Dh36.7 బిలియన్లు) పెంచడం, రాబోయే ఐదేళ్లలో 20,000 ఉద్యోగాలను సృష్టించడం యూఏఈ లక్ష్యం అని యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రి తెలిపారు. దుబాయ్‌లో జరిగిన ఐదవ ఫ్యూచర్ ఫుడ్ ఫోరమ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానికీకరణ ఆవిష్కరణ, యూఏఈ ఆహార సరఫరా గొలుసును పెంపొందించడం, యూఏఈని ప్రపంచ నియంత్రణ శక్తి కేంద్రంగా మార్చడం వంటి లక్ష్యాలను సాధించడానికి ఏడు కీలక అంశాల ఏజెండాను వెల్లడించారు. నిధులు, వ్యూహం, మద్దతు, ప్రపంచ స్థాయి పరిశోధన, అభివృద్ధి ప్యాకేజీలను అందజేస్తామని చెప్పారు. కొత్త మార్కెట్ల ఏర్పాటు, వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయ పంటల విస్తిర్ణాన్ని ఏటా 5 శాతానికి పెంచడం, సగటు వ్యవసాయ ఆదాయాన్ని ఏటా 10 శాతానికి పెంచడం, ఈ రంగంలో శ్రామిక శక్తిని ఏటా 5 శాతం పెంచడం, ఉత్పత్తి యూనిట్ నీటిపారుదల కోసం ఉపయోగించే నీటిలో 15 శాతం వార్షిక తగ్గింపును సాధించడం ప్రధాన లక్ష్యాలన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ విషయంలో యూఏఈ బాగా పనిచేస్తోందని అల్ మర్రి చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







