యూఏఈలో ఘనంగా గణపతి ఉత్సవాలు..
- September 24, 2023
యూఏఈ: అజ్మన్ లోని Mytrifarm లో గణపతి ఉత్సవాలు 5 రోజుల పాటు
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం భక్తి శ్రద్ధ లతో దంపతుల తో పూజల తోపాటు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు నిర్వహించారు.
భారత్ నుంచి ప్రత్యేకంగా తీసుకు వచ్చిన 5 అడుగుల మట్టి గణపతి Mytrifarm లో ప్రతిష్టించి, 5 వ రోజు మాతృభూమిని తలపించేలా తీన్ మార్ డప్పులతో మహిళల, పిల్లల నృత్యాలుతో ఊరేగింపుగా అంగరంగ వైభవంగా గణనాదుని నిమజ్జనం జరిగింది.
ఉదయం నుంచి గణపతి హోమం, కుంకుమ పూజా కార్యక్రమాలు, గణపతి పూజలు నిర్వహించారు.
రికార్డు స్థాయి లో లడ్డూ వేలం AED 7500/-(1,68,000 రూపాయలు) లకు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంకు చెందిన నాగేంద్ర డేగల సొంతం చేసుకున్నారు.
గణపతి అలంకరించిన లక్ష్మి మాలను వేలంలో AED 1300/-(30,000/-) నిజామాబాద్ కు చెందిన అరుణ్ కుమార్ సుర్నిదా (Spark Media) సొంతం చేసుకున్నారు.
నిర్వాహకుల తూర్పుగోదావరి జిల్లా కు చెందిన కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ స్వదేశానికి దూరంగా ఉంటూ మన తెలుగు సంప్రదాయాలను మన పిల్లలు కు తెలియ చేయాలనే ఉద్దేశ్యంతో, ఇటువంటి ఎన్నో సంప్రదాయ కార్యక్రమాలు Mytrifarm లో నిర్వహించు చున్నట్లు తెలియచేశారు.గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించాము అని, వచ్చే ఏడాది ఆ గణేష్ ని కృపతో ఇంకా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించిన excutive కమిటీ కి మరియు ఈ కార్యక్రమం కు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి త్రిమూర్తులు పేరు పేరున ధన్యవాదాలు తెలియ చేశారు.



తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







