'నాకు మరణశిక్ష ఇవ్వండి ' : హంతకుడు బహ్రెయిన్ కోర్టుకి వినతి
- May 20, 2016
మనామా: ఒక వికారమైన సంఘటన లో, తన తోటి రూమ్మేట్ నే హత్య చేసినట్లుగా అనుమానిస్తున్న ఒక ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తికి శుక్రవారం ఉన్నత నేర న్యాయస్థానం మరణశిక్షకు ఆదేశించింది. విధించింది. 29 ఏళ్ల నిందితుడు తన రూమ్మేట్ హిందూ మతం కు చెందినవాడని, ఇస్లాం మతంని అవమానించిన నేపధ్యంలో అతనిని చంపినట్లు ఉన్నత నేర న్యాయస్థానం ఎదుట పేర్కొన్నాడు.,బాంగ్లాదేశ్ కు చెందిన ఈ నిందితుడు పదునైన కత్తిని తీసుకొని తన సహచరుడు మెడను కోసినట్లు తెలుస్తుంది, ఆ తర్వాత అనేక సార్లు కత్తితో పొడిచి మరణించేవరకు వదలలేదని ప్రాసిక్యూషన్ కధనం ఈ హత్య చేసిన తర్వాత, నిందితుడు సమీపంలోని మసీదు వద్దకు వెళ్ళి తాను తన రూమ్మేట్ ని చంపినట్లు వివరించాడు, దీంతో కొందరు భక్తులు ఈ సమాచారంను పోలీసులకు తెలిపారు. "అతను రక్తపు దుస్తులతో ఒక కత్తిని పట్టుకుని అసాధారణ రీతిలో ఉన్మాదిలా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. తాను ఒక వ్యక్తిని హత్య చేసానని అన్నాడు. కొందరు భక్తులు అతనిని నిలువరించి ఆ ఉధృతిని తగ్గించేందుకు ప్రయత్నించారని తరువాత పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు ప్రత్యక్ష సాక్షి న్యాయవాదుల ఎదుట పేర్కొని కోర్టు పత్రాలలో లిఖితపూర్వకంగా తెలిపారు
ప్రాధమిక దర్యాప్తు ప్రకారం, బాంగ్లాదేశ్ హంతకుడు ఆ సంఘటనకు ముందు పరిస్థితిని వివరించాడు. తన హిందూ రూమ్మేట్ నిరంతరంగా ఇస్లాం మతంను కించపర్చవద్ధని పలుమార్లు హెచ్చరికలు చేసి ఉన్నప్పటికీ ఇస్లాం మతంపై దిగజారుడు వాఖ్యలు ఎన్నో చెసినట్లు తెలిపాడు అందుకే తను ఈ నేరానికి పాల్పడినట్లు చెప్పాడు .
ఈ హత్యకు సంబంధించి కోర్టు ఫైళ్లులలో వివరించిన ప్రకారం, తనకు సహచర రూమ్మేట్ ఈ గొడవ వేకువనే సంభవించింది. నిద్రలేచే సమయానికి " తాను దేవుడిని అవమానించాడు, దాంతో నాకు ఎంతో కోపం వచ్చింది. నేను వంటగదిలోనికి వెళ్ళి ఒక పెద్ద పదునైన కత్తిని తీసుకొన్నాను. దాంతో అతని శరీరం పై దాడి చేసి అతని మెడని నరికినట్లు ఆ తర్వాత అతనిక శరీరంప కత్తితో పొడిచినట్లు వివరించారు.
ప్రతివాది ఉద్దేశపూర్వకంగా ఈ హత్య చేసినట్లు కేసు ఛార్జ్ అయ్యింది. ఈ నేరానికి హంతకునికి యావజ్జీవ జైలు లేదా మరణశిక్ష పడే అవకాశముంది. హై క్రిమినల్ కోర్టు అతనికి శుక్రవారం ఆదేశించింది. ఈ కేసులో మరింత పరిశోధనల కోసం నిందితునికి 15 రోజులు రిమాండ్ విధించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







