డ్రగ్స్‌తో పట్టుబడ్డ 8 మంది యూత్
- May 20, 2016
8 మంది యువతీ యువకులు 398 బ్యాగ్‌లలో 'స్పైస్' డ్రగ్స్‌తో పోలీసులకు పట్టుబడ్డ ఘటన అబుదాబీలో చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు కాలేజీ విద్యార్థులు, మరో మరుగ్గురు కాలేజీ విద్యార్థినులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా 21 నుంచి 28 ఏళ్ళ వయసువారే. 125,000 దిర్హామ్‌ల విలువైన డ్రగ్స్‌ని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా వీరిని పోలీసులు పట్టుకున్నారు. జిసిసి నేషనల్, ఓ అరబ్ వ్యక్తి, ముగ్గురు విజిటింగ్ యూరోపియన్స్ ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారని పోలీసులు చెప్పారు. ముందస్తు సమాచారంతో పోలీసులు నిందితులపై నిఘా పెట్టారు. డ్రగ్స్‌ని వేరొకరికి అమ్ముతుండగా సమయం చూసి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పేస్, స్పైస్ మరియు కె2లను నిషేధిత డ్రగ్స్‌గా ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







