రోజూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా.?

- September 27, 2023 , by Maagulf
రోజూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా.?

కొబ్బరి నీళ్లను సెలైన్ వాటర్‌తో పోల్చుతుంటారు. రోజంతా తిండి లేకపోయినా సరే, ఒక్క కొబ్బరి బొండం నీళ్లు ఇచ్చే శక్తి సరిపోతుంది శరీరానికి. ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం కొబ్బరి నీళ్లు. 

కొబ్బరి నీళ్లలో తక్కువ క్యాలరీలు.. తక్కువ చక్కెర వుంటుంది. అందుకే ఎలాంటి హానీ చేయదు ప్రతీరోజూ కొబ్బరి నీళ్లు తాగినా. ఎలక్ట్రోలైట్లు అధికంగా వుంటాయ్ కొబ్బరి నీళ్లలో. అందుకే తక్షణ శక్తి లభిస్తుంది వీటిని తాగిన వెంటనే శరీరానికి. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతని చల్లార్చడంలోనూ కొబ్బరి నీల్లు కీలక పాత్ర వహిస్తాయ్.

కిడ్నీలో రాళ్లు వున్న వాళ్లు ప్రతీరోజూ కొబ్బరి నీళ్లు తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆల్రెడీ వున్నవాళ్లు.. లేక రాకుండా వుండాలనుకునేవాళ్లకూ కొబ్బరి నీళ్లు దివ్యౌషధమే. రాళ్లు ఏర్పడే ఖనిజాల సాంద్రతను తగ్గించడం ద్వారా మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా వుంటాయ్. అలాగే మూత్ర విసర్ఝనను కూడా కొబ్బరి నీళ్లు పెంచుతాయ్. ఈ కారణాలు కిడ్నీలో రాళ్లు రానీయకుండా చేస్తాయ్.

పాలు, పాల సంబంధిత పదార్ధాలను తీసుకోవడం అలవాటు లేని వారు కొబ్బరి నీళ్లను తాగడం అలవాటు చేసుకుంటే మంచిది. వీటిలోని పొటాషియం, కాల్షియం, సోడియం, మెగ్నీషియం వాటికి ప్రత్యామ్నాయంగా పని చేస్తాయ్. శరీరానికి ఆరోగ్యాన్నిస్తాయ్.

అయితే గుండె జబ్బులున్న వాళ్లు, అధిక రక్తపోటు వున్న వాళ్లు కొబ్బరి నీళ్లను కాస్త మితంగానే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com