ఫెయిలైనా విజయ్ డైరీ ఫుల్లే.!
- September 27, 2023
‘లైగర్’ సినిమాతో దాదాపు విజయ్ దేవరకొండ కెరీర్ ఖతమైపోయినట్లే అనుకున్నారంతా. ఆయన కూడా ఆ ఫెయిల్యూర్‌తో చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చేశాడు. మళ్లీ లేటెస్ట్గా ‘ఖుషి’ సినిమాతో విజయ్ దేవరకొండ కెరీర్లో కాస్త మొలకలొచ్చాయ్.
ఈ సినిమాకి అదేంటో భిన్నమైన టాక్ వచ్చిందనుకోండి. హిట్టంటే హిట్టు.. ఫట్టంటే ఫట్.. మొత్తానికి ఈ సినిమాతో విజయ్‌ని మళ్లీ తెరపై చూసుకోగలిగారు అభిమానులు.
ఈ సినిమా ఫెయిల్యూరే అనుకున్నా కానీ, ప్రస్తుతం విజయ్ చేతిలో బోలెడన్ని ప్రాజెక్టులున్నాయ్. ఆన్ స్పాట్ ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్‌పై వున్నాయ్. అందులో ఒకటి గౌతమ్ తిన్ననూరితో తెరకెక్కుతోంది. ఇంకోటి తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్‌తో ఒకటి.
సైమల్టేనియస్‌గా ఈ రెండు సినిమాలూ పూర్తి చేసేస్తున్నాడు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్ననూరి సినిమాలో విజయ్ పోలీస్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఈ సినిమాని ప్రేక్షకుల మొందుకు తీసుకొచ్చే సన్నాహాల్లో వున్నాడు విజయ్ దేవరకొండ.
అలాగే, దిల్ రాజు బ్యానర్లో విజయ్ రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. మైత్రీ మూవీస్ బ్యానర్‌లోనూ మరో రెండు విజయ్ లిస్టులో వున్నాయ్. ఇలా చూసుకుంటూ, దాదాపు అరడజను సినిమాల వరకూ విజయ్ లైన్లో పెట్టి వుంచాడు. సో, ఎలా చూసుకున్నా దాదాపు రెండేళ్ల వరకూ విజయ్ డైరీ ఫుల్ అయిపోయినట్లే.!
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







