లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగించిన హైకోర్టు
- September 29, 2023
అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా ఉన్న టిడిపి నేత నారా లోకేశ్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. లోకేశ్ ను అరెస్ట్ చేయబోమని, సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇస్తామని కోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ఎఫ్ఐఆర్ లో దర్యాప్తు అధికారి మార్పులు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చి ఆయనను విచారిస్తామని చెప్పారు. ఒకవేళ దర్యాప్తుకు లోకేశ్ సహకరించకపోతే, ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొస్తామని, ఆ తర్వాత అరెస్ట్ చేస్తామని తెలిపారు. 41ఏ నిబంధనలను పూర్తిగా పాటిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో హైకోర్టు స్పందిస్తూ… లోకేశ్ అరెస్ట్ పై ఆందోళన లేనందువల్ల విచారణను ముగిస్తున్నామని తెలిపారు. మరోవైపు, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించినట్టు న్యాయనిపుణులు చెపుతున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







