వరుణ్ తేజ్ తో సినిమా తీయనున్న శేఖర్ కమ్ముల
- May 21, 2016
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తక్కువ కాలం లో, విన్నూత్నమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ తనదైన ఐడెంటిటీ సంపాదించుకున్నారు. అటు యువతను ఇటు ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే చక్కటి కథా బలం ఉన్న చిత్రాలను తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు వీరిద్దరి తో, ఉత్తమ కథా చిత్రాల నిర్మాత గా పేరు ఉన్న దిల్ రాజు త్వరలో ఒక చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు.
ఒక అమెరికా అబ్బాయి, తెలంగాణా అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథే ఈ చిత్రం. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, "శేఖర్ కమ్ముల ఒక వండర్ఫుల్ స్టొరీ టెల్లర్. వరుణ్ తేజ్ ఇప్పటికే మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అమెరికా లో ఉండే ఒక అబ్బాయి కి , తెలంగాణా లో పెరిగిన ఒక అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథ ఈ చిత్రం. త్వరలో షూటింగ్ ప్రారంభం అవుతుంది", అని తెలిపారు. ఈ చిత్ర తారాగణం, సాంకేతిక నిపుణులు మరియు ఇతర వివరాలను త్వరలోనేవిడుదల చేస్తాం అని చిత్ర బృందం తెలిపింది.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







