శృతి హాసన్ రేంజ్ పెరిగిందిగా.!
- October 03, 2023
శృతి హాసన్ ఈ ఏడాది రెండు తెలుగు సినిమాల్లో నటించింది. రెండూ పెద్ద సినిమాలే. మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేర్ వీరయ్య’, నందమూరి బాలయ్యతో ‘వీర సింహా రెడ్డి’ సినిమాలు.
అయితే రెండు సినిమాలతోనూ శృతి హాసన్‌కి పెద్దగా పేరొచ్చిందేమీ లేదు. కానీ, శృతి హాసన్‌కి మాత్రం ప్రమోషన్ వచ్చేసింది. ఓ ఇంగ్లీష్ మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకుంది శృతి హాసన్. ఆ సినిమా పేరే ‘ది ఐ’.
సైకలాజికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతోన్న ఈ సినిమాలో శృతి హాసన్ ‘ది లాస్ట్ కింగ్డమ్’ హీరో మార్క్ రౌలీతో స్ర్కీన్ షేర్ చేసుకుంటోంది.
ఓ ఐలాండ్‌లో చనిపోయిన తన భర్త అస్థికల కోసం వెళ్లిన వితంతువుగా ఈ సినిమాలో శృతి హాసన్ నటించింది. ఆ దీవిలో ఆమె ఎదుర్కొన్న అనూహ్య సంగతులని ఈ సినిమాలో చాలా థ్రిల్లింగ్‌గా చూపించారు. సినిమా కోసం చాలా ఈగర్‌గా ఎదురు చూస్తున్నా.. అంటూ శృతి హాసన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ సినిమా తన కెరీర్లో తనకు చాలా చాలా ప్రత్యేకమైనది.. అని శృతి హాసన్ అభివర్ణించింది. అన్నట్లు తెలుగులో శృతి హాసన్ త్వరలో ‘సలార్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









