అయ్యో పాపం.! కాజల్‌కే ఎందుకిలా.?

- October 03, 2023 , by Maagulf
అయ్యో పాపం.! కాజల్‌కే ఎందుకిలా.?

కోవిడ్ టైమ్‌లో పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకి జన్మనిచ్చి తల్లి ప్రేమ అనుభూతిని కూడా ఎంజాయ్ చేసేసింది అందాల చందమామ కాజల్ అగర్వాల్. ఆ తర్వాత మళ్లీ సినిమాలు కంటిన్యూ చేస్తూ కెరీర్‌నీ చక్కదిద్దుకుంటోంది.

‘ఆచార్య’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించాల్సి వుండగా.. ఆఖరి నిముషంలో ఆమె పాత్రను లేపేశారు. సినిమా ఫైనల్ అవుట్ పుట్‌లో ఇబ్బందికరంగా వుందంటూ కాజల్ పాత్రను ఆ సినిమాలో డిలీట్ చేయడం జరిగింది.

ఆ ముచ్చట ఇంకా మరువకముందే, మళ్లీ కాజల్‌కి అన్యాయం జరిగిందంటూ ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ సారి నందమూరి నట సింహం బాలయ్య సినిమాలో కాజల్‌కి ఆ అన్యాయం జరిగిందట.

బాలయ్య హీరోగా ‘భగవంత్ కేసరి’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీలీల ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. కాగా, ఈ సినిమాకీ హీరోయిన్ రోల్ కాస్త అడ్డంకిగానే వుందనిపించిందట. దాంతో, నిరభ్యంతరంగా కాజల్ క్యారెక్టర్ లేపేశారనీ గుసగుసలు వినిపిస్తున్నాయ్.

ఈ గుసగుసలో నిజమెంతో కానీ, ఒకవేళ అదే జరిగితే, కాజల్ కెరీర్‌కి పెద్ద దెబ్బే అది. కాజల్ కానీ, చిత్ర యూనిట్ కానీ, రెస్సాండ్ అయితే తప్ప, ఈ గాసిప్‌లో నిజమెంతో తెలీదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com