వెలగపండుతో అలసట నీరసం మటుమాయం.!
- October 03, 2023
వెలగపండు లేదా వుడ్ యాపిల్‌గా పిలవబడే ఈ పండులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్. వినాయక చవితి రోజు ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టే పండ్లలో వెలగపండు మొదటి స్థానంలో వుంటుంది.
వినాయకునికి నైవేద్యంగా పెట్టడమే కాదండోయ్.. మన ఆహారంలోనూ భాగం చేసుకోవడం ఎంతో ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
వెలగపండులో అనేక రకాల ఆయుర్వేద గుణాలున్నాయట. సీజన్ మార్పుల వల్ల వచ్చే వైరల్ జ్వరాలు, దగ్గు, జలుబు వంటి వాటి నుంచి వెలగ పండు కాపాడుతుందట.
అలసట, నీరసాన్ని దరి చేరనీయకుండా చేస్తుందట. జ్వరాల కారణంగా వచ్చే అలసటను తగ్గించుకోవడానికి బెల్లం కలిపిన వెలగపండు జ్యూస్ తాగితే మంచి ఉపశమనం వుంటుందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు, వాంతులు, విరేచనాలు వంటి సమస్యల్ని తగ్గించి, శరీరానికి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది వెలగ పండు. అలాగే, ఈ పండులో అత్యధిక మోతాదులో ఫైబర్ కంటెంట్ వుండడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
అందుకే ఈ సీజన్‌లో మాత్రమే లభించే ఈ పండును ఖచ్చితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







