వరల్డ్ యానిమల్ డే 2023 డేట్,థీమ్: జంతువుల రక్షణ, చరిత్ర ప్రాముఖ్యత
- October 04, 2023
యూఏఈ: ప్రతి సంవత్సరం అక్టోబర్ 4న ప్రపంచ జంతు దినోత్సవాన్ని(వరల్డ్ యానిమల్ డే) ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇది జంతు హక్కులు, సంక్షేమం కోసం నిర్దేశించిన అంతర్జాతీయ దినోత్సవం. జంతువుల ప్రేమికుడైన ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి గౌరవార్ధం అక్టోబర్ 4ను వరల్డ్ యానిమల్ డేగా జరుపుకోవాలని నిర్ణయించారు. ప్రపంచ జంతు సంక్షేమ ఉద్యమాన్ని హైలెట్ చేయాలని, ప్రపంచాన్ని అన్ని జంతువులకు మెరుగైన ప్రదేశంగా మార్చడానికి ప్రపంచ శక్తిగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ రోజున, జంతు ప్రేమికులు ఏకమై జంతు హింస, నిర్లక్ష్యం, జంతువుల పట్ల అన్యాయానికి వ్యతిరేకంగా చర్య తీసుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ సంవత్సరం “గ్రేట్ ఆర్ స్మాల్, లవ్ దెమ్ ఆల్” అనే థీమ్ తో ప్రపంచ జంతు దినోత్సవం జరుపుకుంటున్నారు.
ప్రపంచ జంతు దినోత్సవ చరిత్ర
ప్రపంచ జంతు దినోత్సవం ఆలోచనను జర్మన్ మ్యాగజైన్ మెన్ష్ అండ్ హండ్ (మ్యాన్ అండ్ డాగ్) రచయిత, ప్రచురణకర్త హెన్రిచ్ జిమ్మెర్మాన్ రూపొందించారు. జిమ్మెర్మాన్ మార్చి 24, 1925న జర్మనీలోని బెర్లిన్‌లోని స్పోర్ట్స్ ప్యాలెస్‌లో మొదటి ప్రపంచ జంతు దినోత్సవ వేడుకను నిర్వహించారు. రికార్డుల ప్రకారం.. ఈ కార్యక్రమానికి 5,000 మందికి పైగా హాజరయ్యారు. ప్రపంచ జంతు దినోత్సవాన్ని ప్రోత్సహించడానికి జిమ్మెర్మాన్ అవిశ్రాంతంగా కృషి చేశారు. మే 1931లో, ఫ్లోరెన్స్ ఇటలీలో జరిగిన అంతర్జాతీయ జంతు పరిరక్షణ కాంగ్రెస్ కాంగ్రెస్‌లో అక్టోబర్ 4ని ప్రపంచ జంతు దినోత్సవంగా జరుపుకోవాలనే అతని ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించబడింది. దానిని తీర్మానంగా ఆమోదించబడింది. 2003లో యూకే-ఆధారిత జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థ నేచర్‌వాచ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమం మరింత మందికి చేరువయ్యేలా ప్రపంచ జంతు దినోత్సవం వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
ప్రపంచ జంతు దినోత్సవం ప్రాముఖ్యత
ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులు ప్రపంచ జంతు దినోత్సవ వేడుకలో పాల్గొంటారు. జంతు సంరక్షణ, పరిరక్షణ గురించి అవగాహన పెంచుకోవడానికి సహాయం చేస్తారు. ప్రతి సంవత్సరం ప్రపంచ జంతు దినోత్సవం రోజున ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది. అనేక దేశాలలో అనేక రకాల స్ఫూర్తిదాయకమైన ఈవెంట్లు నిర్వహించబడుతున్నాయి.మనలో ప్రతిఒక్కరూ ఒక మార్పును తీసుకురావచ్చు. భవిష్యత్ తరాల కోసం జంతువులను రక్షించడానికి, సంరక్షించడానికి ప్రతిజ్ఞ చేయవచ్చు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!







