మరో అద్భుతం సృష్టించిన ఇస్రో..
- October 04, 2023
ఇస్రో శాస్త్రవేత్తలు మరో అద్భుతం సృష్టించారు. చంద్రుడి ఉపరితలంపై 14రోజుల పాటు గడ్డకట్టే చలిలో గడిపిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు ఇక శాశ్వత నిద్రలోకి జారుకుంటాయని భావిస్తున్న వేళ ఇస్రో తాజాగా చేపట్టిన ప్రయోగం విజయవంతం అయింది. దీంతో విక్రమ్ ల్యాండర్ లోని ఇంజన్లను మండించి కాస్తంత ఎత్తుకు ఎగిరేలా చేసి పక్కకు దిగేలా చేశారు. ప్రస్తుతం అదిఉన్న శవశక్తి పాయింట్ నుంచి 40 సెంటీమీటర్లు ఎత్తుకు ఎగిరి తర్వాత 30 సెంటీమీటర్ల పక్కకు జరిగి సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో మళ్లీ చంద్రయాన్-3 మిషన్ ప్రయోగం పునరుద్ధరణపై ఆశలు చిగురించాయి.
తాజాగా శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రయోగం షెడ్యూల్ లో లేదు. కేవలం ప్రయోగాత్మకంగానే చేసి విజయం సాధించారు. భవిష్యత్తులో చంద్రుడిపై సేకరించే మట్టి, ఇతరత్రా శాంపిళ్లను తిరిగి భూమి మీదకు తేవడానికి అక్కడి నుంచి వ్యోమనౌక టేకాఫ్ కావడం ముఖ్యం. అందులో భాగంగా సంబంధిత ప్రయోగాన్ని విక్రమ్ ల్యాండర్ తో చేశారు. చంద్రయాన్ -3 ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. వీరముత్తవేల్ ఈ విషయంపై మాట్లాడుతూ.. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉపరితలంపై తమ 14 రోజుల పరిశోధన, అన్వేషణలో చాలా క్లిష్టమైన డేటాను అందించాయని తెలిపారు. తాజా ప్రయోగం సమయంలో విక్రమ్ ల్యాండర్ ఇంజిన్ లో మండించడం ద్వారా, ఊహించిన విధంగా దాదాపు 40 సెంటీమీటర్ల వరకు కదిలించగలిగినట్లు చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతంతో చంద్రుని ఉపరితలం నుంచి భారతదేశానికి నమూనాలను తిరిగి ఇవ్వగలిగేలా భవిష్యత్తు మిషన్ ను అభివృద్ధి చేయవచ్చునిన వీరముత్తవేల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









