అల్లు రామాయణం ముందుకు కదులుతోందా.?
- October 04, 2023
అప్పుడెప్పుడో రామాయణ ఇతిహాసాన్ని తెరకెక్కించాలన్న తన మనసులోని మాటను బయటపెట్టారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కించాలనుకున్నారాయన. నిర్మాత మధుమంతెనతో కలిసి అల్లు అరవింద్ ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించాలనుకుంటున్నారు.
నితీష్ తివారి అందుకు స్ర్కిప్టు వర్క్ కూడా చేస్తున్నారు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్ర పోషిస్తుండగా, సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబోతోందన్న వార్త హల్ చల్ చేస్తోంది.
అలాగే, ‘కేజీఎఫ్’ ఫేమ్ యష్ రావణాసుడి పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ ఇతిహాసాన్ని మూడు భాగాలుగా నితీష్ తెరకెక్కించాలనుకున్నాడనీ తెలుస్తోంది. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ఇతిహాసం రూపొందబోతోందట.
‘ఆది పురుష్’ సినిమా విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అలాంటి తప్పులు దొర్లకుండా చాలా జాగ్రత్తగా ఈ సినిమాని రూపొందించాలనుకుంటున్నారట. ఏ ఒక్క చిన్న విషయాన్నీ లైట్ తీసుకోకుండా దగ్గరుండి మరీ స్క్రిప్టు పనులు చూసుకుంటున్నారట అల్లు అరవింద్. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పర్ఫెక్ట్ టీమ్ పని చేస్తోందనీ తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలతో ఓ క్లారిటీ ఇవ్వనున్నారట. చూడాలి మరి, ఈ రామాయణం ఎలాంటి రెస్పాన్స్ అందుకోనుందో.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







