‘టైగర్’ ప్యాన్ ఇండియా వర్కవుట్ అవుతుందా.?
- October 04, 2023
మాస్ రాజా రవితేజ హీరోగా రూపొందుతోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా త్వరలో రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సినిమాని ప్యాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ కోణంలోనే బాలీవుడ్‌లో సినిమాని తెగ ప్రమోట్ చేస్తున్నారు.
అయితే, ఇటీవల తెలుగు సినిమాలు బాలీవుడ్‌లో పెద్దగా వర్కవుట్ కావడం లేదు. చాలా సినిమాలు అక్కడ బొక్క బోర్లా పడ్డాయి. ఇక మాస్ రాజా విషయానికి వస్తే, తెలుగులోనే దారుణంగా ఫ్లాప్ అవుతున్నాడు. ఇక, హిందీలో అది కూడా ప్యాన్ ఇండియా.. అంటే అస్సలు వర్కవుట్ అయ్యే పనేనా.?
కానీ, సినిమాకి బిజినెస్ బాగా జరిగిందంటున్నారు. బాలీవుడ్‌లో సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. స్టూవర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సబ్జెక్ట్ ఒకింత కలిసొచ్చే అవకాశముంది.
అయినా, కానీ, రవితేజ వైపు నుంచి చూస్తే.. ఎంత మేర కలిసొస్తుందో తెలియక నిర్మాతలు ఆందోళన చెందుతున్నారట. కానీ, రవితేజ మాత్రం పక్కా నమ్మకంగా వున్నాడట. ఎలాగైనా ఈ సినిమాతో హిట్టు కొడతానంటున్నాడట. చూడాలి మరి. అన్నట్లు కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ ఈ సినిమాలో రవితేజకి జోడీగా నటిస్తోంది.
తాజా వార్తలు
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్









