ఆకస్మిక మరణాలకి కారణం టైప్ 2 మధుమేహమేనా.?
- October 04, 2023
ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండానే పలువురు సెలబ్రిటీలు ఆకస్మికంగా మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. ఈ మరణాలకు టైప్ 2 మధుమేహం ఓ కారణం కావచ్చని ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది.
మధుమేహం ఒక్కసారి ఎటాక్ అయితే అంతే సంగతి. జీవితాంతం దానితో సహజీవనం చేయాల్సిందే. మారుతున్న జీవన శైలి, ఆహార కల్తీ.. వయసుతో సంబంధం లేకుండా మధుమేహం వ్యాపించేలా చేస్తోంది.
ముఖ్యంగా యువత మధుమేహం బారిన ఎక్కువగా పడుతున్నారు. అందుకు కారణం ఒత్తిడి. ఒత్తిడిని లైట్ తీసుకోరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే, సరైన వ్యాయామం లేకపోవడం, ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చునే వుద్యోగాల్లో వున్నవారు, సరైన పోషకాహారం తీసుకోని వారు, టైమ్‌కి తిండి, నిద్ర లేని వారు ఈ టైప్ 2 మధుమేహానికి గురవుతున్నారు.
టైప్ 2 మధుమేహం కారణంగా చిన్న వయసులోనే పక్షవాతం, గుండె నొప్పి, మూత్ర పిండాల సమస్యలు తదితర సమస్యలు యువతను బాధిస్తున్నాయ్. ఇవే ఆకస్మిక మరణాలకు దారి తీస్తున్నాయ్. అందుకే డయాబెటిస్ ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకుంటూ, వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా ఆయుర్ధాయం పెంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







