గల్ఫ్ అమరులు... అందని మృతధన సహాయం
- May 21, 2016
ఎడారి ఎండలో చెమటను చిందించి గల్ఫ్ వలసకార్మికులు విదేశీ మారకద్రవ్యాన్ని భారత్ కు పంపి మాతృదేశ అభివృద్ధికి పాటుపడుతున్నారు. వీరి స్వేదంతో భారత ప్రభుత్వం ఇంధనం (పెట్రోల్, డీజిల్) కొనుగోలు చేస్తున్నది. సైనికులు దేశ సరిహద్దుల్లో కష్టపడుతున్నట్లుగానే, గల్ఫ్ కు వెళ్ళిన కార్మికులు దేశంఆవల విదేశీగడ్డపై కుటుంబం కోసం, మాతృభూమి కోసం శ్రమిస్తున్నారు. గల్ఫ్ లో చనిపోయిన శ్రమజీవులను 'గల్ఫ్ అమర వీరులు' అనకున్నా... కనీసం 'గల్ఫ్ అమరులు' అని పిలుచుకుందాం. Gulf Martyrs (గల్ఫ్ మార్టియర్స్).
తెలంగాణ రాష్ట్రంలో 600 కు పైగా గల్ఫ్ మృతుల కుటుంబాలు ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) కోసం జిల్లా కలెక్టర్ల ద్వారా పెట్టుకున్న దరఖాస్తులను ప్రభుత్వం తిప్పి పంపింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం చేసింది శూన్యం.
ఎవరో వస్తారని... ఏదో చేస్తారని ఎదురు చూసి చూసి అలసిపోయిన గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఉడతా భక్తిగా సహాయం చేయడానికి దుబాయి లోని 'ఐ-కేర్ ఫౌండేషన్' అనే సంస్థ కరీంనగర్ జిల్లాలోని రెండు కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. ఇందుకోసం 'ప్రవాసి మిత్ర' మాసపత్రిక అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







