AFC ఆసియా కప్‌లో 6,000 మంది వాలంటీర్లు

- October 06, 2023 , by Maagulf
AFC ఆసియా కప్‌లో 6,000 మంది వాలంటీర్లు

దోహా: AFC ఆసియా కప్ ఖతార్ 2023 కోసం స్థానిక ఆర్గనైజింగ్ కమిటీ నిన్న తన వాలంటీర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. స్టేడియంలు, ప్రేక్షకుల సేవలు, అక్రిడిటేషన్, మీడియా కార్యకలాపాలతో సహా 20 ఫంక్షనల్ ప్రాంతాలకు మద్దతు ఇవ్వడానికి నిర్వాహకులు 6,000 మంది వాలంటీర్లను నియమించనున్నారు. AFC ఆసియా కప్ ఖతార్ 2023 లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ CEO, జస్సిమ్ అల్ జాసిమ్ లుసైల్ స్టేడియంలో జరిగిన లాంచ్‌లో మాట్లాడుతూ.. బలమైన స్వచ్ఛంద సంస్కృతి వృద్ధి ఖతార్ ప్రధాన క్రీడా ఈవెంట్‌లను నిర్వహించడం ద్వారా సాధించిన గొప్ప వారసత్వాలలో ఒకటిగా అభివర్ణించారు. వాలంటీర్ల చురుకైన భాగస్వామ్యం లేకుండా ఏ ప్రధాన క్రీడా ఈవెంట్ జరగదని అల్ జాసిమ్ అన్నారు.  AFC ఆసియా కప్ ఖతార్ 2023లో తాము 6,000 మంది వాలంటీర్లను నియమిచనున్నట్లు తెలిపారు.

 AFC ఆసియా కప్ ఖతార్ 2023 జనవరి 12 నుండి ఫిబ్రవరి 10, 2024 వరకు ఖతార్‌లో జరుగుతుంది. మొత్తం 51 మ్యాచ్‌లు 9 స్టేడియంలలో నిర్వహిస్తారు. నిర్వాహకులు ఖతార్ నుండి వాలంటీర్లను రిక్రూట్ చేస్తారు. వాలంటీర్లు తప్పనిసరిగా 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. అప్లికేషన్లు ఇప్పుడు volunteer.asiancup2023.qa ద్వారా పంపించాలి. లుసైల్ స్టేడియంలో వాలంటీర్ రిక్రూట్‌మెంట్ కేంద్రం ఉంటుంది. షార్ట్‌లిస్ట్ చేసిన దరఖాస్తుదారులు అక్కడ ముఖాముఖి గ్రూప్ ఇంటర్వ్యూలకు ఆహ్వానించబడతారు. విజయవంతమైన అభ్యర్థులందరూ శిక్షణా కార్యక్రమం ద్వారా వెళతారు. కొన్ని వాలంటీర్ పాత్రలు డిసెంబర్ 1న ప్రారంభమవుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com