GCC-EU జాయింట్ మినిస్టీరియల్ సమావేశానికి ఒమన్ ఆతిథ్యం
- October 06, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ 2023 అక్టోబర్ 9, 10 తేదీలలో EU-GCC జాయింట్ మినిస్టీరియల్ కౌన్సిల్ 27వ సెషన్ను నిర్వహించనుంది. GCC పక్షానికి విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ నేతృత్వం వహిస్తుండగా..ఈయూ పక్షానికి యూరోపియన్ యూనియన్ ఫర్ ఫారిన్ అఫైర్స్ అండ్ సెక్యూరిటీ పాలసీ ఉన్నత ప్రతినిధి జోసెఫ్ బోరెల్ నాయకత్వం వహిస్తారు. ఈ సమావేశానికి జిసిసి సెక్రటరీ జనరల్ జాసిమ్ మహ్మద్ అల్ బుదైవి హాజరుకానున్నారు. యూరోపియన్ యూనియన్ , GCC రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముప్పైకి పైగా అధికారిక ప్రతినిధి బృందాలు సమావేశంలో పాల్గొంటాయి. ఇందులో యూరోపియన్ కమిషన్, GCC సెక్రటేరియట్ జనరల్స్ కూడా పాల్గొంటారు. సమావేశంలో మంత్రులు ఉమ్మడి ప్రాధాన్యతలపై చర్చిస్తారు. EU-GCC వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించే మార్గాలను అన్వేషిస్తారు. భద్రత మరియు శాంతి సమస్యలపై చర్చిస్తారు. అదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ , మార్కెట్ స్థిరత్వానికి మద్దతు ఇవ్వడంపై ఉన్న సంక్షిష్టతలపై ఫోకస్ చేస్తారు.
తాజా వార్తలు
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త







