ఇరాక్ లో మరో దారుణం..
- May 21, 2016
ఇరాక్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఆత్మాహుతి బాంబు దాడులు జరగడంతో ఏడు మందికి పైగా మృతిచెందగా, మరో 30 మంది గాయాలపాలయ్యారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందిని ఇరాక్ అధికారులు వెల్లడించారు. దుజైల్ పట్టణంలో సలాహుద్దీన్ సరిహద్దులో ఓ గుర్తుతెలియని దుండగుడు నడుముకు కట్టుకున్న బెల్టు బాంబును పేల్చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. మార్కెట్ ఏరియాలో ఎక్కువ మంది షాపింగ్ చేయడానికి వస్తుంటారని ప్రాణనష్టం ఎక్కువ జరగాలని భావించి ఈ ప్రాంతంలో అలాంటి చర్యకు పాల్పడ్డాడని పోలీసులు వివరించారు.అయితే మృతుల సంఖ్యపై స్పష్టతలేదని, పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. గత మంగళవారం కూడా ఇరాక్ లో బాంబు దాడి జరిగి 36 మంది మృతిచెందగా, 100 మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ దాడికి తమదే బాధ్యతని, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్లు ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







