భారత్‌లో ముస్లింలపై జరిగిన హింసాకాండకు ప్రతీకారం తీర్చుకుంటాo..
- May 21, 2016
భారత్‌లో ముస్లింలపై జరిగిన హింసాకాండకు ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాదసంస్థ 'ఇస్లామిక్‌స్టేట్' (ఐఎస్) హెచ్చరించింది. ఈ మేరకు 22 నిమిషాల నిడివి ఉన్న వీడియో విడుదల చేసింది. కశ్మీర్‌తోపాటు బాబ్రీమసీదు విధ్వంసం, గుజరాత్, ముజఫర్‌నగర్‌లలో మతకల్లోలాల సందర్భంగా ముస్లింలపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరించారు. చెట్లను, ఆవులను, సూర్యుడిని పూజించే హిందువులతో కలిసి జీవించటమేమిటంటూ భారత్‌లోని ముస్లింలను ఎద్దేవా చేశారు. ఐఎస్ ఆధీనంలోని ప్రాంతాలకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఐఎస్ తరఫున సిరియాలో పనిచేస్తున్నారంటూ అయిదుగురు భారతీయ యువకులను వీడియోలో పరిచయం చేశారు. వివిధ ప్రశ్నలకు వారిసమాధానాలను చిత్రీకరించారు. ఈ యువకుల్లో ఒకడు థానెకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఫహాద్ తన్వీర్ షేక్ అని వెల్లడైంది. ఫహాద్ 2014లో ముగ్గురితో కలిసి సిరియాకు వెళ్లిపోయాడు. వీడియోలో ఫహాద్ తననుతాను అబూఅమ్రాఅల్హిందీ అని పరిచయం చేసుకున్నాడు. తనతోపాటు సిరియాకు వచ్చి మరణించిన షమీమ్‌కు నివాళి అర్పించాడు. ప్రతీకారం తీర్చుకోవటానికి కత్తులు చేతపట్టుకొని భారత్‌కు వస్తామంటూ హెచ్చరించాడు. ఫహాద్తోపాటు సిరియా వెళ్లిన అరీబ్మజిద్ ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆధీనంలో ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







