యాంకర్ సుమ కుమారుడు హీరో అయిపోయాడోచ్.!
- October 07, 2023
యాంకర్ సుమకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. యాంకర్‌గా తనదైన మాటల సునామీతో ప్రత్యేకమైన ప్రేక్షకాదరణ పొందడమే కాదు.. సినీ ప్రముఖులందరిలోనూ సుమ కనకాలకు మంచి గుర్తింపు వుంది.
అందుకే తన కుమారుడి డెబ్యూ మూవీ పోస్టర్ని ఏకంగా టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ అయిన రాజమౌళి చేతుల మీదుగా ఓపెన్ చేయించింది. అవునండీ.. సుమ కనకాల కుమారుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
రోషన్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ‘బబుల్ గమ్’ అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. మానస హీరోయిన్గా నటిస్తోంది. టైటిల్‌తో పాటూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు తాజాగా రాజమౌళి. అక్టోబర్ 10న ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ కానుందని ఈ పోస్టర్ ద్వారా అప్డేట్ ఇచ్చారు.
సుమ మంచి నటి. అందులో నో డౌట్. అలాగే రాజీవ్ కనకాల ఫ్యామిలీ కూడా నటనకు ప్రాణం పోసిన వారే.. ఇలాంటి ఓ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వస్తున్న రోషన్ నటుడిగా తానేంటో ప్రూవ్ చేసుకుంటే అవకాశాలకు ఇండస్ర్టీలో కొదవే వుండదనడం అతిశయోక్తి కాదేమో.
సుమ కనకాల తలచుకుంటే, టాలీవుడ్ మోస్ట్ పాపులర్ డైరెక్టర్లు రోషన్‌తో సినిమాలు చేసేందుకు ఏమాత్రం తటపటాయించకుండా ముందుకొస్తారనొచ్చేమో. అయితే, అంతకన్నా ముందు రోషన్ తనను తాను ప్రూవ్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్







