త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగాస్టార్.!
- October 07, 2023
మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాతో ఫెయిల్యూర్ చవి చూసినప్పటికీ ఏమాత్రం తగ్గని ఉత్సాహంతో తదుపరి వరుసగా ప్రాజెక్టులు ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. యంగ్ డైరెక్టర్లూ, సీనియర్ డైరెక్టర్లూ అనే తేడా లేకుండా ఓ అరడజనుకు పైగా కొత్త ప్రాజెక్టులు సిద్ధం చేసి వుంచారు.
అందులో వశిష్ట సినిమా, కళ్యాణ్ కృష్ణ సినిమాలు త్వరలో పట్టాలెక్కించేయనున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ లిస్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వున్నారు. అయితే, ఇప్పట్లో త్రివిక్రమ్ ఖాళీ అయ్యే అవకాశాల్లేవ్ కానీ, చిరంజీవి కోసం ఆల్రెడీ ఓ స్ర్కిప్టు అయితే సిద్ధం చేసి వుంచారట ఆయన.
ఇదిలా వుంటే, వెంకీ కుడుములతో ఓ సినిమా చేయాల్సి వుంది మెగాస్టార్ చిరంజీవి. ఆ ప్రాజెక్ట్ వెంకీతో క్యాన్సిల్ అయ్యిందనీ.. అదే ప్రాజెక్ట్ త్రివిక్రమ్ చేతికి వచ్చిందంటూ ఓ ప్రచారం తెర పైకి వచ్చింది. ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మించబోతున్నారనీ తెలుస్తోంది.
పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. త్రివిక్రమ్ అయితే, ప్రస్తుతం మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాల్సి వుంది. చూడాలి మరి, జరుగుతున్న ప్రచారం నిజమైతే.. మాటల మాంత్రికుడు, అల్లు అర్జున్‌తో తదుపరి ప్రాజెక్ట్ చేస్తాడా.? లేక చిరంజీవి ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కిస్తాడా.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







